ఇంద్రసేన మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

చిత్రం: ఇంద్రసేన
దర్శకుడు: శ్రీ‌నివాస‌న్
నిర్మాత: రాధికా శ‌ర‌త్‌కుమార్‌, ఫాతిమా విజ‌య్ ఆంటోని
సంగీతం: విజ‌య్ ఆంటోని
నటీనటులు: విజ‌య్ ఆంటోని, డ‌యానా చంపికా

వైవిధ్యమైన సినిమాలను తీసే విజయ్ ఆంటోని తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. ‘బిచ్చగాడు’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో తన సత్తా చాటుకున్నాడు విజయ్ ఆంటోని. ఆ తరువాత విజయ్ ఆంటోని నటించిన అన్ని సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఇంద్రసేన’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర అలరించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
ఇంద్రసేన(విజయ్‌ ఆంటోని), రుద్రసేన(విజయ్‌ ఆంటోని) ఇద్దరు కవల పిల్లలు. ఇంద్రసేన ఎలిజెబెత్‌ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తన కళ్లముందే చనిపోవడంతో తాగుడుకి బానిసవుతాడు. రుద్రసేన ఓ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తుంటాడు. రుద్రసేనకు రేవతి(డయానా చంపిక)అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. ఇంద్రసేన తన స్నేహితుడి కోసం రూ.6 లక్షలు అప్పు చేస్తాడు. ఒక చిన్న అప్పు ఈ కుటుంబాన్ని కష్టాల్లో పడేస్తుంది. ఇంద్రసేన జైలు పాలు అవుతాడు. జైలు నుంచి తిరిగొచ్చిన వచ్చిన ఇంద్రసేనకు తన తమ్ముడు పెద్ద రౌడీ అయి కనిపిస్తాడు. రుద్రసేన అలా మారడానికి కారణాలు ఏంటి..? ఇంద్రసేన తన తమ్ముడికి వచ్చిన సమస్యను పరిష్కరించే మార్గంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? అనేది మిగతా స్టోరి.

విశ్లేషణ:
విజయ్ ఆంటోని చిత్రం అంటేనే ఓ ఆసక్తి ఏర్పడుతుంది ప్రేక్షకుల్లో. ప్రేమ, కుటుంబం, అన్నదమ్ముల సెంటిమెంట్‌ను కలగలిపి దర్శకుడు రాసుకున్న కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఆ కథను తెరపై చూపించిన విధానం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదనిపించినా ఇంటర్వెల్ టైమ్‌లో వచ్చే సీన్స్ ఇంట్రెస్ట్‌ను కలిగిస్తాయి. ఓ ఆసక్తికరమైన ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లోనూ ఇదే తరహా కథతో నడిపించి ఉంటే చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చేది. కానీ క్లైమాక్స్ సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అయినట్లు కనిపించడంతో ఈ సినిమాలో ఎన్ని కథలు ఉన్నాయో తెలియని అయోమయంలో పడిపోతారు జనాలు.

రాజకీయ నేపథ్యంలో నడిచే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఇంద్రసేన పాత్రను ఎలివేట్ చేసే విధంగా దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు మెప్పిస్తాయి. తన తమ్ముడిని రక్షించుకోవడం కోసం ప్రత్యర్థులతో అన్న తలపడే విధానం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ సీన్స్‌లో లేడీ పోలీస్ ఆఫీసర్‌కు, హీరోకు మధ్య సాగే డైలాగులు సినిమాకు బలం. డైరెక్టర్ జి.శ్రీనివాసన్ తనకు కావాల్సిన ప్రతి చోట అతిగా రాసుకున్న సీన్స్, ట్విస్ట్ సినిమాను పూర్తిగా కిందికి దించేశాయి. పోనీ సీన్స్ ఏమైనా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయా అంటే అది లేదు. చాలా సన్నివేశాలు చాలా నెమ్మదిగా నడుస్తూ చిరాకు తెప్పించాయి.

నటీనటులు పర్ఫార్మెన్స్:
రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించడానికి విజయ్ ఆంటోని బాగా కష్టపడ్డాడు. ఎమోషనల్ సీన్స్‌లో అతని పర్ఫార్మెన్స్‌ కేక అని చెప్పాలి. డాన్స్, రొమాన్స్ వంటి విషయాల్లో కాస్త ఇబ్బంది పడినట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్‌ డయానా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సినిమాలో మిగతా అందరూ తమిళ వారు కావడంతో తెలుగు ప్రేక్షకులు వారిని పట్టించుకోలేదు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు శ్రీనివాసన్ కేవలం ఒకే పాయింట్ మీద కథను రాసుకుని ఉంటే సినిమా పర్వాలేదని స్థాయిలో అయినా ఉండేది. కానీ అలా చేయకుండా అనవసరంగా ఇష్టమొచ్చినట్లుగా డిఫరెంట్ ఎపిసోడ్స్‌ను సినిమాలోకి బలవంతంగా ఇరికించడంతో సినిమా బోర్ కొట్టేసింది. ఇక విజయ్ అంటోనీ సంగీతం కూడా పెద్ద గొప్పగా లేదు. ఎడిటింగ్ పని ఇంకాస్త బాగుండాల్సింది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

చివరిగా: ఇంద్రసేన – ఒక్క టిక్కెట్‌పై ఎన్నో సినిమాలు!

నేటిసినిమా రేటింగ్: 2.5/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.