ట్రైలర్ రివ్యూ : ఇంద్రసేన.. అడ్రస్ అదిరింది!

vijay antony indrasena trailer review
Tellmeboss.net

హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా నిత్యం ప్రయోగాత్మక చిత్రాలు చేసే హీరోల్లో విజయ్ ఆంటోనీ ఒకడు. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించడంతోపాటు తనకంటూ మంచి మార్కెట్ సంపాదించుకున్న విజయ్.. తర్వాత ‘సైతాన్’, ‘యమన్’ చిత్రాలతో పలకరించాడు. అయితే ఆ రెండు మూవీలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. దీంతో.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే గట్టి నిర్ణయంతో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ఇంద్రసేన’తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆమధ్య మెగాస్టార్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయించిన విజయ్.. తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశాడు.

Tellmeboss.net

ఈ ట్రైలర్ గురించి విశ్లేషిస్తే.. జీవితంలో హీరో ఎదుర్కొన్న అనుభవాల గురించి అడ్రస్ రూపంలో డైలాగ్ చెప్పిన తీరు అదిరిపోయింది. అదే ఇందులో మేజర్ హైలైట్. ఓటమి, నమ్మకద్రోహం, అప్పు.. వీటిని ఎదుర్కొని జీవితంలో గెలిచిన వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తే యముడు రూపంలో సమస్యలు ఇంకా వెంటాడుతూనే వున్నాయనడాన్ని ‘అడ్రస్’ రూపంలో వున్న డైలాగ్ రొమాలు నిక్కబొచుకునేలా చేస్తుంది. ఆ డైలాగ్‌కి తగ్గట్టుగా విజయ్ వాయిస్ పర్ఫెక్ట్‌గా సూటయ్యింది. ఇక కథలోకి వెళ్తే.. మోసం వల్ల దారుణంగా దెబ్బ తిన్న ఓ వ్యక్తి తిరిగి పుంజుకుని జీవితంలో ఎలా విజయం సాధించాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. రౌడీయిజం, రాజకీయంతోనూ కథ ముడినిపట్లు తెలుస్తోంది.

విజయ్ ఆంటోనీ ఎప్పట్లాగే తన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సీరియస్‌ లుక్‌లో అదరగొట్టేశాడు. సినిమాటోగ్రీఫీ, డైరెక్టర్ టేకింగ్ అదిరిపోయాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్‌కి మరో మేజర్ ప్లస్ పాయింట్. ఆడియెన్స్‌ని ఆ మూడ్‌లోకి తీసుకెళ్లే విధంగా సంగీత దర్శకుడు బీజీఎమ్ వాయించేశాడు. ఓవరాల్‌గా ట్రైలర్ సూపర్. మరి.. ఈసారైనా విజయ్ విజయం సాధిస్తాడా? లేదా? చూడాలి.

Tellmeboss.net
Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.