2M నుంచి 30Kకి ఢమాల్.. గంగలో విజయ్ పరువు!

అవతల ఎంత తోపు హీరో వున్నా సరే.. కంటెంట్ బాగుంటేనే జనాలు అతని సినిమాల్ని హిట్ చేస్తారు. లేకపోతే థియేటర్లలోకి వచ్చిన సినిమాని రెండు రోజులకే తిప్పికొడతారు. సేమ్ ఇలాంటి పరిణామమే విజయ్ దేవరకొండ విషయంలో జరిగింది.

‘పెళ్ళి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ చిత్రాలతో స్టార్ హీరోల కేటగిరీలోకి చేరిపోయిన ఈ హీరో నుంచి లేటెస్ట్‌గా ‘ఏ మంత్రం వేసావె’ సినిమా వచ్చింది. అఫ్‌కోర్స్ ఆ రెండు చిత్రాలకంటే ముందు ఐదేళ్ళ క్రితం తీసిన సినిమానే అయినా.. కథలపై విజయ్‌కి మంచి టేస్ట్ వుందనే అభిప్రాయంతో జనాలు కాస్త ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్లకు వెళ్ళారు. ఇది ఊహించిన దానికంటే మరీ చేదుగా వుండడంతో.. యాక్ థూ అంటూ జనాలు ఊంచేశారు. ఈ దెబ్బకు రెండో రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా వసూళ్ళు రాబట్టలేదు.

పెద్ద స్థాయిలోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసినా.. దారుణమైన ఫలితాన్నందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్‌లోనూ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. గురువారం ప్రీమియర్స్, శుక్రవారం రెగ్యులర్ షోలతో కలుపుకుని ఈ మూవీ కేవలం $ 27K మాత్రమే వసూలు చేసింది. ఇక శనివారం సంగతి చెప్పుకోకపోవడమే మంచిది. ఓవరాల్‌గా ఈ చిత్రం $ 40K మార్కును కూడా అందుకునేలా లేవు. పాపం.. విజయ్ ముఖం చూసి సినిమాని కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయినట్లే!

కేవలం బయ్యర్లే కాదు.. విజయ్ పరులు కూడా గంగలో కలిసినట్లే! అసలు ఎవ్వరికీ పెద్దగా పరిచయం లేనప్పుడే ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో 1.3 మిలియన్ మార్క్‌ని అందుకున్నాడు విజయ్. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో ఏకంగా 2 మిలియన్ డ్రీమ్ మార్క్‌నీ దాటేశాడు. అలాంటిది.. తన లేటెస్ట్ మూవీతో కనీసం 50 వేల డాలర్ల మార్క్‌ని కూడా అందుకోలేకపోవడం అవమానకరమే!

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.