‘మహానటి’లో అది తప్పు.. నిజం చెప్పిన కూతురు

‘మహానటి’ సినిమా రిలీజైన తర్వాత లెజెండరీ నటి సావిత్రి జీవితానికి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నీమధ్యే సావిత్రి మద్యపానానికి బానిస అవ్వడానికి చంద్రబాబు అనే మరో నటుడి హస్తముందని ఓ షాకింగ్ న్యూస్ బయటికి రాగా.. లేటెస్ట్‌గా మరో విషయం మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

సావిత్రి మృతి చెందినప్పటి నుంచి.. ఆమె విషాదానికి జెమిని గణేషనే కారణమని ప్రచారం జరుగుతూ వస్తోంది. మహానటిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న ఆమెను అమాయకురాలిని చేసి జెమిని పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత మోసం చేసి మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నాడని టాక్ నడుస్తూ వస్తోంది. అంతేకాదు.. సావిత్రి డబ్బుల్ని కూడా జెమిని కాజేశాడని ఇప్పటికీ ప్రచారం ఉంది. అయితే.. సినిమాలో మాత్రం అందుకు భిన్నంగా చూపించారు. వాళ్లిద్దరి పెళ్లి దారితీసిన పరిణామాలు.. ఆ తర్వాత జెమిని దారితప్పిన విషయాల్ని సానుకూలంగా చూపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సావిత్రి ఆర్థికంగా సంక్షోభంలో పడటానికి జెమిని కారణం కాదన్నట్లుగా మూవీలో ప్రెజెంట్ చేశారు.

ఇదిచూసిన కొన్ని వర్గాల వారు.. అదంతా అబద్ధమని, సావిత్రికి ఆర్థిక సమస్యలు తలెత్తడంలో జెమిని పాత్ర కూడా ఉందని మళ్ళీ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే.. ఇందుకు తెరదించుతూ సావిత్రి తనయురాలు విజయ చాముండేశ్వరి అసలు నిజం చెప్పుకొచ్చారు. తన తల్లి (సావిత్రి) నుంచి జెమిని ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, ఆమె ఆర్థిక సంక్షోభానికి ఆయన కారణం కాదని స్పష్టం చేశారు. బంధువులు, పనివాళ్ళే సావిత్రిని మోసం చేశారని.. వాళ్ళవల్లే నగలు, డబ్బులు, ఆస్తులు పోయాయని క్లారిటీ ఇచ్చారు.

Related posts:
ఎస్సై ఇంట్లోనే చోరీ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
చంద్రుడిపై నడిచాడు.. చుక్కల్లోకెక్కినాడు
మహిళలను అవమానించారని బాలయ్యపై కేసు నమోదు??
ధోని స్టంప్స్ తీసుకెళ్ళడం వెనుక ఓ ఎమోషనల్ స్టోరీ.. తెలిస్తే అతని ఫ్యానైపోతారు!
అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు.. గ్రామపెద్దలు మెచ్చుకున్న ఘనుడు
రాంగోపాల్ వర్మ మోసం చేశాడు : ‘వీరప్పన్’ భార్య

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.