ఖైదీ ‘సెలవు’ అంతా ఉత్తిదేనా?

Was that holiday on Chiru Khaidino150 is a fake

మెగాస్టార్ చిరంజీవి ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి తొమ్మిది సంవత్సరాల తర్వాత చేస్తున్న ఖైదీ నెంబర్ 150 విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 11న విడుదల కానున్న ఈ సినిమా ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగాఫ్యాన్స్ ఖైదీ నెంబర్ 150 ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా అంతలోనే ఖైదీ నెంబర్ 150కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అసలు మెగా ఫ్యాన్స్ ఇదంతా చేశారా? లేదంటే వేరే వాళ్లు ఇలా చేశారా? అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

చిరంజీవి 150వ సినిమాగా వస్తున్న ఖైదీ నెంబర్ 150కోసం ఇప్పటికే అందరూ ఎదురుచూస్తుండగా, ఈ సినిమా విడుదల రోజు సెలవు ప్రకటిస్తూ ఓ గల్ఫ్ కంపెనీ ఓ లెటర్ ను విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా అది ఓ ఫేక్ లెటర్ అని, అదంతా ఎవరో కావాలని చేసిందే అని దాదాపుగా తేలిపోయింది. లెటర్ లో కనీసం మేనేజర్ అనే పదం కూడా తప్పుగా ఉండటం, కంపెనీ లెటర్ హెడ్ లో పోస్టర్ ఉండటం ఏంటి? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి అది ఓ ఫేక్ లెటర్ అనే వార్త ఇప్పుడు మెగా అభిమానులకు షాకిస్తోంది.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.