వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ఎవరో తెలుసా?

ఈ ఫోటోలో ఎంతో ముద్దుగా, చాలా అమాయకుడిగా కనిపిస్తున్న అబ్బాయి ఎవరో తెలుసా? ఇప్పుడితగాడు టాలీవుడ్‌లో గ్యాప్ లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమా కి తన మార్కెట్ రేంజ్ పెంచుకుంటూ.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాడు. అంతేకాదండోయ్.. ఈతరం హీరోల్లో ఏ ఒక్కరూ సాధించని అరుదైన రికార్డ్‌ని ఇతనొక్కడే సృష్టించాడు. ఇప్పటికీ అతనెవరో గుర్తు పట్టలేకపోతున్నారా?. సరే.. చివరగా మరో క్లూ ఇస్తాను. అతను ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరో పసిగట్టగలిగారా? ఎస్.. మీరు అనుకుంటున్నది నిజమే. ఆ అబ్బాయి మరెవ్వరో కాదు.. తన నేచురల్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంటున్న హీరో నాని.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత చేసిన మూవీల్లో కొన్ని ఫ్లాప్, ఇంకొన్ని డీసెంట్ హిట్స్ సాధించాయి. అయితే.. దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ‘ఈగ’ మూవీతో నాని రాత్రికిరాత్రే స్టార్ అయిపోయాడు. పైగా.. ఆ చిత్రం ఆరోజుల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో.. నానికి ఇక తిరుగు ఉండదనుకున్నారు. కానీ.. ఆ తర్వాత ఇతగాడు చేసిన మూవీలు వరుసగా అపజయాలు చవిచూశాయి. స్టార్ దర్శకులతో చేసినా ఫలితం లేకపోయింది. దీంతో మనోడు ట్రెండ్‌కి తగ్గట్టు తన గేర్ మార్చాడు. విభిన్న కథాచిత్రాలవైపు మొగ్గుచూపాడు. ఈ నేపథ్యంలోనే ‘ఎవడే సుబ్రమణ్యం’ మూవీ చేయగా.. అది యావరేజ్ హిట్‌గా నిలిచి.. నానిని మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. అంతే.. ఆ తర్వాత మనోడి దశ ఒక్కసారిగా మారిపోయింది. ఆ మూవీ అనంతరం నాని చేసిన మూవీలన్నీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచాయి.

ఇక ఇతను సాధించిన ఆ రికార్డ్ ఏంటనుకుంటున్నారా? మరేదో కాదు.. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకోవడం. ఈతరం హీరోల్లో ఇంతవరకు ఏ ఒక్కరూ ఈ ఫీట్ అందుకోలేదు. ఇప్పుడు మనోడు చేయబోతున్న మూవీల మీద కూడా మంచి అంచనాలే వున్నాయి. వీలైతే మరో హ్యాట్రిక్ హిట్ అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.