‘ఏ మంత్రం వేశావె’ మూవీ రివ్యూ-రేటింగ్

చిత్రం : ఏ మంత్రం వేసావె
నటీనటులు : విజయ్‌ దేవరకొండ, శివానీ సింగ్‌, తదితరులు
దర్శకత్వం : శ్రీధర్‌ మర్రి
నిర్మాత : మల్కాపురం శివకుమార్‌
మ్యూజిక్ : అబ్దూస్‌ సమద్‌
ఎడిటర్ : ధర్మేంద్ర కాకరాల
విడుదల తేదీ : 09-03-2018

ఈ చిత్రం ఇప్పటిది కాదు.. 2013లో సెట్స్ మీదకి వెళ్ళింది. సరైన కారణాలేంటో తెలియరాలేదు కానీ.. ఈ చిత్రం ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు చిత్రీకరణ జరుపుకుంటూ వచ్చింది. ఒకానొక సమయంలో దీన్ని ఆపేశారు. ఇంతలో ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’లతో విజయ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోవడంతో.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు యూనిట్ చకచకా పనులు కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి.. ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? విజయ్ ‘మంత్రం’ ఈ చిత్రానికి వర్కౌట్ అయ్యిందా? లేదా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి..

కథ : వీడియో గేమ్‌ డిజైనర్‌గా పనిచేసే రాగమాలిక (శివానీ సింగ్‌)కు ఒక లక్ష్యం వుంటుంది. హింసతో కూడిన ఆటలకు భిన్నంగా మానవత్వంతో అదికూడా రియలిస్టిక్‌గా వుండేలా ఒక గేమ్‌ని డిజైన్ చేయాలన్నదే రామమాలిక ఆశయం. మేనేజ్‌మెంట్ నుంచి తనకు మద్దతు లేకపోయినా.. తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని ఫిక్స్ అవుతుంది.

కట్ చేస్తే.. నిఖిల్ (విజయ్ దేవరకొండ) కంప్యూటర్ గేమ్స్‌కి బానిసైన యువకుడు. బయట ప్రపంచాన్ని మర్చిపోయి.. వారాలు, నెలలు తరబడి గేమ్స్‌ ఆడుతుంటాడు. అంతేకాదు.. అమ్మాయిలతో నిత్యం చాటింగ్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నిఖిల్‌ తన ఫేస్‌బుక్‌ స్నేహితుల ద్వారా రాగమాలికను చూస్తాడు. ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ.. ఆమె మాత్రం అతని రిక్వెస్ట్‌ని రిజెక్ట్ చేస్తుంది. సరిగ్గా ఇదే టైంలో రాగమాలికకు తన వీడియో గేమ్ ఆలోచన తట్టడంతో.. దాన్ని రియల్‌గా నిఖిల్ విషయంలో అప్లై చేయాలని అనుకుంటుంది.

తనతో స్నేహం చేయాలంటే ఒక ఆట ఆడాలని నిఖిల్‌ని అడుగుతుంది. అందుకు అతను ఓకే అని చెప్పగా.. కొన్ని క్లూస్ ఇచ్చి తన చిరునామా తెలుసుకోవాల్సిందిగా చెప్తుంది. ఇదే సమయంలో ఓ ఆన్‌లైన్ ముఠా వీరి ఆటని ఆటంకం కలిగిస్తుంటుంది. ఇంతకీ వాళ్ళెవరు? వీళ్ళని ఎదుర్కొని, రాగమాలిక ఇచ్చిన క్లూస్‌ని ఛేదించి నిఖిల్ ఆమెని చేరుకుంటాడా? చివరికి ఏమయ్యింది? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
ఈ సినిమా స్టోరీలైన్ నిజంగా డిఫరెంట్.. ట్రెండ్‌కి తగినట్లుగానే కొత్తగా వుంది.. పైగా ఈ చిత్రం ద్వారా ప్రజలకు ఇవ్వాలనుకున్న మెసేజ్ కూడా ఉత్తమమైందే! కానీ.. దాన్ని వెండితెరపై ఎగ్జిక్యూట్ చేసిన విధానమే చిరాకు తెప్పించేసింది. చూస్తున్నంతసేపూ ఒక సార్ట్ ఫిలిం చూస్తున్నామా? అనే ఫీలింగే కలుగుతుందే తప్ప.. ఒక థ్రిల్లింగ్ చిత్రం చూస్తున్నామనే భావన వుండదు. ఇదే ఈ చిత్రానికి అతిపెద్ద మేజర్ మైనస్ పాయింట్. కథనం కూడా వీక్‌గా వుండడంతో ఈ చిత్రం బెడిసికొట్టింది.

సరే.. ఇక సీన్‌లోకి వద్దాం. ఏ మూవీలోనైనా ప్రారంభ సన్నివేశాలు ఆసక్తికరంగా వుండేలా చూసుకుంటారు. అప్పుడే కథపై మరింత క్యూరియాసిటీ నెలకొంటుంది. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. సాదాసీదా సీన్లతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇలాగే కాసేపు నత్తనడక నడిచాక.. హీరోయిన్ ఎంట్రీ కాస్త వేగం పుంజుకుంటుంది. అప్పుడు నుంచి మూవీ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఆమెను వెతికే క్రమమంతా కాస్త సాగదీసినట్లుగా అనిపించినా.. చివరికి ఏమవుతుందనే ఆసక్తి కొనసాగుతుంటుంది. ఇలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్ళిన ఈ మూవీని.. చివర్లో మళ్ళీ దెబ్బేశాడు దర్శకుడు. పతాక సన్నివేశాలు సినిమా ఉద్దేశాన్నే మార్చేయడంతో ప్రేక్షకుడు పూర్తిగా నిరుత్సాహానికి గురవుతాడు.

నటీనటుల ప్రతిభ :
గత రెండు చిత్రాల్లో అతను చూపించిన నటనా ప్రతిభతో పోల్చుకుంటే.. ఇందులో పూర్తిగా తేలిపోయాడు. గొప్పగా చెప్పుకునేంత నటన అతను కనబరచలేకపోయాడు. లుక్స్ పరంగా ఫర్వాలేదనిపించాడు. కథానాయిక శివానీ సింగ్‌ ఓకే కానీ గ్లామర్‌ పరంగా మాత్రం పెద్దగా మార్కులు పడవు. మిగతా తారాగణం మామూలే.

టెక్నికల్ టీం :
బడ్జెట్ ప్రాబ్లమో ఏమో గానీ.. టెక్నికల్‌ టీం ఎఫర్ట్ పెద్దగా కనిపించలేదు. సో సోగానే అనిపిస్తాయంతే! సినిమాటోగ్రఫీ షాట్ పిలింని తలిపిస్తుంది. సంగీతం ఓకే. రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు నాసిరకంగా అనిపిస్తాయి. దర్శకుడు ఎంచుకున్న స్టోరీ కొత్తదే అయినా.. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. కథనం సరిగ్గా రాసుకోలేక బోర్ కొట్టించాడు.

ఫైనల్ పంచ్ : ఇదో తికమక పట్టించే ఆట !
రేటింగ్ : 2/5

Related posts:
రజనీ ఆ మాట చెప్పాడని.. ‘రోబో 2.0’ నుంచి అమితాబ్ తప్పుకున్నాడట!
నాన్నకు ప్రేమతో బ్యానర్‌లో అడుగెట్టిన అల్లరోడు
ఆడియో ఫంక్షన్‌కి రావొద్దంటూ ఫ్యాన్స్‌కి విజ్ఞప్తి చేసిన పవన్‌కళ్యాణ్
‘జెంటిల్‌మన్’ 10 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్..
‘శాతకర్ణి’పై వస్తున్న ఆ పుకార్లను కొట్టిపారేసిన క్రిష్
ఒక రిపోర్టర్ హీరోగా.. అదీ డ్యూయెల్ రోల్‌లో!

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.