బాహుబ‌లి టీంకు యూ ట్యూబ్ భారీ షాక్‌

బాహుబ‌లి టీంకు యూట్యూబ్ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. దేశ‌వ్యాప్తంగా ఈ ప్రెస్టేజియ‌స్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైల‌ర్‌కు యూట్యూబ్‌లో ఊహించ‌ని స్థాయిలో స్పంద‌న వ‌చ్చింది. కేవ‌లం తెలుగు, త‌మిళ్‌, హిందీ వెర్ష‌న్స్‌లో క‌లిపి రోజున్న‌ర‌లో 30 ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఈ వీడియోకు భారీగా వ్యూవ్స్ రావ‌డంతో పాటు…యూట్యూబ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఈ వీడియో ఉంద‌ని యూ ట్యూబ్ యాజ‌మాన్యం ఈ వీడియోను తొల‌గించింది.

యూట్యూబ్ పాలసీకి భంగం కలిగించేలా ఈ వీడియో ఉందని యూట్యూబ్ పేర్కొంది. ఈ ట్రైలర్ తొలగించడంతో బాహుబలి ఫ్యాన్స్ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. వెంట‌నే స్పందించిన బాహుబ‌లి టీం యూ ట్యూబ్ వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. మ‌ళ్లీ దీన్ని యూ ట్యూబ్‌లో పెట్టించేందుకు జ‌క్క‌న్న తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.