యుద్ధం శరణం మూవీ రివ్యూ, రేటింగ్ & అనాలసిస్

Yuddham Sharanam Movie Review

చిత్రం : యుద్ధం శరణం
దర్శకత్వం : కృష్ణ మరిముత్తు
నిర్మాత : సాయి కొర్రపాటి
సంగీతం : వివేక్ సాగర్
నటీనటులు : నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్, రావు రమేష్, రేవతి తదితరులు

యువ హీరో అక్కినేని నాగచైతన్య వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అతడు నటించిన ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ సారి కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తూ చేసిన సినిమా ‘‘యుద్ధం శరణం’’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో మంచి బజ్‌ను ఏర్పరుచుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
అర్జున్(నాగ చైతన్య) ఓ సాధారణ యువకడు. డాక్టర్లయిన తన తల్లిదండ్రులు రావు రమేష్, రేవతితో సంతోషంగా జీవనం కొనసాగిస్తుంటాడు. తమ స్నేహితుడి కూతురు అంజలి(లావణ్య త్రిపాఠి)ని వారి ఇంట్లో కొన్ని రోజులు ఉండటానికి ఒప్పుకుంటారు అర్జున్ తల్లిదండ్రలు. ఈ క్రమంలో అంజలితో ప్రేమలో పడతాడు అర్జున్. వీరి ప్రేమకు పెద్దలు కూడా మద్దతు పలుకుతారు. అంతా సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో అనుకోని సంఘటన ఒకటి ఎదరవుతుంది. గ్యాంగ్‌స్టర్ నాయక్(శ్రీకాంత్) మరియు అతడి మనుష్యులను వెంటాడే పనిలో పడతాడు అర్జున్. ఈ క్రమంలో అర్జున్-నాయక్‌లకు సంబంధించిన ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక యాక్షన్ మూడ్‌లోకి వచ్చిన సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారిపోతుంది. ఇంతకీ అర్జున్ తల్లిదండ్రులకు ఏమైంది? నాయక్‌తో అర్జున్‌కు సంబంధం ఏమిటి? చివరకు అర్జున్ తన ఫ్యామిలీని కాపాడుకుంటాడా? అనేది సినిమా స్టోరీ!

విశ్లేషణ:
అక్కినేని నాగచైతన్య గత రెండు సినిమాలు హిట్స్‌గా నిలవడంతో ఈ సారి కాస్త డిఫరెంట్‌గా వస్తాడని అనుకున్నారు అందరూ. కానీ రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సెలెక్ట్ చేసుకున్న చైతూ స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేద్దాం అని మనముందుకు ‘యుద్ధం శరణం’తో వచ్చాడు. సినిమాలో పసలేకపోవడంతో సదరు ప్రేక్షకుడికి అసహనం వేస్తుంది. ఇక కొత్త దర్శకుడు ఇలాంటి రొటీన్ కథను ఎంచుకున్నందుకు ముందుగా అతడి గడ్స్‌ను మెచ్చుకోవాలి. కానీ.. సినిమాను ఉన్నది ఉన్నట్టుగా తీసేయడం, స్క్రీన్‌ప్లేను సరిగా వాడకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.

ఫస్టాఫ్ వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించి ఇంటర్వెల్ నుండి అది కాస్త యాక్షన్ థ్రిల్లర్‌గా మారిన తీరు అస్సలు బాగాలేదు. నటీనటులు కూడా గొప్పగా ఏమీ చేయకపోవడం మరో మైనస్ పాయింట్. టెక్నికల్‌ పరంగానూ సినమాలో ఏమీ లేకపోవడంతో షో ఎప్పుడు అయిపోతుందా అని అసహనంగా చూశారు జనాలు. ఓవరాల్‌గా యుద్ధం శరణం సినిమా టాలీవుడ్‌లో వచ్చిన అనేక రొటీన్ సినిమాలను మరోసారి గుర్తు చేసింది. ఇక ఇలాంటి సినిమాలను మళ్ళీ చూడాలనుకునే వారు యుద్ధం శరణంకు వెళ్లవచ్చు.

నటీనటులు పర్ఫార్మెన్స్:
అక్కినేని నాగచైతన్య ఈ సినిమాతో మరోసారి తనలోని నటుడిని ఆవిష్కరించారు. కథనంతో ఎక్కడా మెప్పించని ఈ సినిమా కేవలం చైతూ యాక్టంగ్‌తో ఆకట్టుకుంటుంది. ఇక విలన్‌గా మారిన శ్రీకాంత్ ఈ సినిమాలో ఏదో మ్యాజిక్‌ చేస్తాడని అనుకున్నారందరూ. కానీ వారి ఆశలపై నీళ్ళు చల్లాడు శ్రీకాంత్. ఏదో చిన్న విలన్‌రోల్‌లా సాగిపోయింది ఇతడి క్యారెక్టర్. లావణ్య త్రిపాఠికి ఈ సినిమాలో ఎక్కడా యాక్టింగ్‌కు స్కోప్ లేకపోవడంతో అమ్మడిని వేస్ట్‌గా వాడుకున్నట్లు అనిపిస్తుంది. మిగతా నటీనటులు తమతమ పాత్రలకు ఉన్నంతలో న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఒక రొటీన్ కథన ఎంచుకున్న కొత్త దర్శకుడు కృష్ణ మరిముత్తు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేతో ఏదో చేద్దామని అనుకున్న డైరెక్టర్ దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడంలోనూ ఫెయిల్ అయ్యాడు. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. సంగీతం కొంతవరకు బాగానే ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు సినిమాలో కనిపిస్తాయి.

చివరిగా:
యుద్ధం శరణం – ఇది చూడాలంటే కావాలి సహనం!!

నేటిసినిమా.కామ్ రేటింగ్: 2.5/5

Related posts:

Comments

comments

Disclaimer: At times our Title attracts you very much and matter justifies Title unexpectedly in a different way. We suggest you not to feel odd just enjoy how you presume.